సీపీఐకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదాను ఉపసంహరించడం అవివేక చర్య : కూనంనేని

-

జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఎన్సీపీ, టీఎంసీ, సీపీఐ పార్టీలు జాతీయ హోదాను కోల్పోగా.. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించింది. అయితే.. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదాను ఉపసంహరించడం అవివేక చర్య అని విమర్శించారు. ఈ సమయంలో ఉపసంహరించడం అనేక అనుమానాలకు తావిస్తోందని, జాతీయ హోదాకు గుర్తింపు సంబంధించిన నిబంధనలే తప్పుగా ఉన్నాయని, దానిని తాము త్వరలో సవాలు చేస్తామని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల ఫలితాల ఆధారం చేసుకొని జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం సరైంది కాదన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీ విధానం ఉన్నదని, ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు, అన్ని స్థానాలలో పోటీ చేయలేవని, ఎన్నికల అవగాహనలు, సర్దుబాట్లు ఉంటాయన్నారు.

Kunamneni Sambasiva rao: ప్రధాని మోడీని ప్రశ్నించకూడదా.. ప్రశ్నిస్తే  అరెస్ట్ చేస్తారా? - NTV Telugu

వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు విధానంలో జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ నిర్దారించడం సరైంది కాదన్నారు. ఎన్నికలు డబ్బులు, ప్రలోభాలమయం అయిపోయాయని, వీటిని అరికట్టలేక ఎన్నికల కమిషన్, ప్రతి ఎన్నికల్లో తన అసమర్థతను చాటుకుంటోందన్నారు. ప్రస్తుత ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ విధానాన్ని రద్దు చేసి, దామాషా పద్ధతిలో నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ పార్టీల వాస్తవ బలం బైటపడుతుందని, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వమే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును భరించాలన్నారు. సీపీఐ జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ ఉపసంహరించినంత మాత్రాన పార్టీ ఎన్నికల గుర్తు కంకి కొడవలి గుర్తు పోదని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ హోదాను కొనసాగించిన విషయాన్ని కూనంనేని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news