వచ్చే ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీదే అన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని, లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణే అందుకు నిదర్శనమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రేపు ఎన్నికల్లో రాబోతున్నాయి. కాబట్టి ప్రతీ కార్యకర్త, ప్రతీ నాయకుడు కష్టపడాలి అని నేతలకు దిశానిర్దేశం చేశారు అచ్చెన్నాయుడు. నియోజకవర్గ పరిశీలకులు కార్యకర్తలు, నేతలతో సమన్వయంతో కలిసికట్టుగా పని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పాటుపడాలని ఆదేశించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణలపై దిశానిర్దేశం చేశారు.
కుటుంబ సాధికార సారథుల నియామకం పూర్తి చేయాలిఎన్నికలకు ఎంతో సమయం లేదని అచ్చెన్నాయుడు నియోజకవర్గ ప్రజలకు సూచించారు. నియోజవకవర్గాల్లో పార్టీని బలోపేతంచేయడంపై నియోజకవర్గ పరిశీలకులు ప్రధానదృష్టిపెట్టాలి అని సూచించారు. ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై, కుటుంబసాధికార సారథుల పనితీరుపై పరిశీలకులు దృష్టిపెట్టాలి అని సూచించారు.కుటుంబ సాధికార సారథుల పని కేవలం 20శాతంమాత్రమే పూర్తైంది. మిగిలిన 80శాతాన్ని వీలైనంతత్వరగా పూర్తిచేయాలి అని పిలుపునిచ్చారు. 2024ఎన్నికల్లో విజయంసాధించాలంటే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంచేయాలి అని అచ్చెన్నాయుడు సూచించారు.