లగడపాటి రాజగోపాల్ గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఎన్నికల కు లగడపాటి సర్వే లు చెబుతూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న తాజాగా తెరపైకి వచ్చారు. లగడపాటి రాజగోపాల్ తాను ఎంపీగా ఉన్నప్పుడు తన అనుచరుడిగా.. ఉన్న ఓ నేత కుటుంబ సభ్యుడు చనిపోవడంతో పరామర్శించడానికి మైలవరం నియోజకవర్గానికి వెళ్లారు. ఆయన ప్రస్తుతం వైసిపిలో ఉన్నారు. లగడపాటి వస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా వచ్చారు.
ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడి లంచ్ చేసి బయలుదేరి వెళ్లారు. అయితే అక్కడికి లగడపాటి రావడంతో… ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రాజగోపాల్ వస్తున్నారు అంటూ కొంతమంది ప్రచారం చేశారు. అనూహ్యంగా ఈసారి వైసీపీ నేతలు తమ పార్టీ తరపున లగడపాటి బరిలో దింపి ఉన్నారని చెబుతున్నారు.
అక్కడ సమావేశం అయింది వైసీపీ నేతలతో కాబట్టి అలా చెప్పడానికి ఆధారం లభించింది. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని లగడపాటి గతంలో ప్రకటించారు. ఈమేరకు ఎన్నికల్లో పోటీ చేయడం మానుకున్నారు. ఆ తర్వాత సర్వేలు మాత్రం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చల నేపథ్యంలో నిజంగానే లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా అనేది చూడాలి.