హుజూర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సైదిరెడ్డికి ఇదే తొలి, చివరిసారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గరిడేపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 50 వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని బూత్ ల్లో, ప్రతి బూత్ కి 200 మంది పార్టీ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని సూచించారు.