సీఎం జగన్, చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున… మా అందరి కోసమే వెళ్లారంటూ..

-

ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య టికెట్ రేట్ల వివాదం జరుగుతూనే ఉంది. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రమానికి చేరుకున్న చిరంజీవి జగన్ నివాసం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ బిడ్డగా వచ్చానని చిరంజీవి అన్నారు.

ఇదిలా ఉంటే ఈ భేటీపై నాగార్జున స్పందించారు. మా అందరి గురించే చిరంజీవి, సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారని ఆయన అన్నారు. బంగార్రాజు సినిమా విడుదలలో బిజీగా ఉండటం వల్లే చిరంజీవితో కలిసి వెళ్లలేకపోయానని ఆయన అన్నారు. జగన్ తో చిరంజీవి భేటీ అవుతారని గతంలోనే నేను చెప్పానని..జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం అని నాగార్జున అన్నారు.

అయితే ఈ భేటీ తరువాత టికెట్ రేట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు, ఇటు రాజకీయ వ్యక్తుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. వీటన్నింటికి ఈ భేటీతో సమాధానం దొరుకుతుందని అంతా భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news