ఓవైపు థియేటర్లలో సంక్రాంతి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఓటీటీలోనూ సందడి మొదలు కానుంది. ఇప్పటికే తెగింపు’, ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘కల్యాణం కమనీయం’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలు ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వారం ఓటీటీ వేదికగా అలరించేందుకు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే థియేటర్లలో రిలీజ్‌కాగా కొన్ని నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..?
రష్మిక నటించిన మరో హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడు. షాంతను బగ్చీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో జనవరి 20న విడుదలవుతుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో మరికొన్ని..
కాపా (మలయాళం), దట్ నైన్టీస్ షో (సిరీస్- ఇంగ్లిష్), వుమెన్ ఎట్ వార్: జనవరి 19
ఫౌద సీజన్ 4 (సిరీస్), శాంటీటౌన్ (నైజీరియన్ మూవీ), బ్లింగ్ అంపైర్ (ఇంగ్లిష్ సిరీస్): జనవరి 20
ధమాకా (తెలుగు): జనవరి 22
జీ 5
రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన హిందీ సినిమాల్లో ‘ఛత్రీవాలి’ ఒకటి. తేజస్ డీయోస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ ‘జీ 5’లో జనవరి 20న విడుదలకాబోతోంది.
ఏటీఎం (సిరీస్- తెలుగు, తమిళం): జనవరి 20
ఆహా
డ్రైవర్ జమున (తెలుగు, తమిళం): జనవరి 20
యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్ తెలుగులో): జనవరి 21
డిస్నీ+ హాట్‌స్టార్
ఝాన్సీ సీజన్- 2 (సిరీస్- తెలుగు): జనవరి 19
బిగ్ స్కై సీజన్- 3, ఎపిసోడ్ 13 (సిరీస్): జనవరి 19
అబాట్ ఎలిమెంటరీ సీజన్- 2, ఎపిసోడ్ 13: జనవరి 19
లాస్ట్ మ్యాన్ ఫౌండ్ సీజన్-1: జనవరి 20
ది ఎల్ వరల్డ్: జెనరేషన్ క్యూ సీజన్- 3, ఎపిసోడ్ 10: జనవరి 20
అమెజాన్ ప్రైమ్ వీడియో
సినిమా మార్తే డమ్ టక్: జనవరి 20
ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెకీనా: జనవరి 20