ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటిండి…అయితే ఈ రెండున్నర ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా? అంటే మెజారిటీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మద్ధతు ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే రెండున్నర ఏళ్లలో రాజకీయం చాలా మారింది. ఇప్పటికీ వైసీపీ లీడ్‌లోనే ఉంది గానీ…టీడీపీ కూడా గతం కంటే పికప్ అయింది.
ఆ సర్వే ప్రకారం ఇప్పటికీ ఏపీలో వైసీపీ లీడ్‌లోనే ఉందని తేలింది. అలాగే టీడీపీ పికప్ అయిందని తెలిసింది. అయితే ఆ సర్వే లెక్కల ప్రకారం కొన్ని సీట్లలో వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తేలింది….ఆ సీట్లలో ఏ పార్టీకి లీడ్ ఇవ్వలేదు. అసలు టోటల్ సర్వే వివరాలని ఒక్కసారి చూస్తే..ఏపీలో 175 నియోజకవర్గాలకు గాను…వైసీపీకి 71 సీట్లలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అలాగే టీడీపీకి 59 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెప్పింది.
ఇక జనసేన మాత్రం నాలుగు స్థానాల్లో సత్తా చాటవచ్చని చెప్పింది. ఇక గెలుపోటములని డిసైడ్ చేసే సీట్లు 41 ఉన్నాయట. ఈ స్థానాల్లో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని తెలుస్తోంది. అంటే వైసీపీ-టీడీపీల మధ్య గట్టి ఫైట్ ఉందని అర్ధమవుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే వైసీపీనే లీడ్ లో ఉంది.