మొదలైన Lava X3 (2022)..ఆఫర్స్ ఇవే..!!

-

ఇండియన్‌ మార్కెట్‌లోని లావా తన కొత్త స్మార్ట్ ఫోన్ సేల్‌ను ప్రారంభిచింది. అదే లావా X3. ఇప్పుడు 2022 మోడల్ లావా X3 ఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. డిసెంబర్‌ ప్రారంభంలోనే ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఫోన్‌కు సంబంధించిన వివరాలు, ధర, ఆఫర్స్‌ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దామా..!

ఆఫర్స్..

ఆర్టిక్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్, లస్టర్ బ్లూ ఫోన్‌ కలర్ ఆప్షన్‌లో ఫోన్‌ అందుబాటులో ఉంది.
స్మార్ట్‌ఫోన్‌పై వెల్‌కమ్ ఆఫర్‌లలో రూ. 6,600 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తుంది.
AU స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్ ఉంది.
HSBC క్రెడిట్ క్యాడ్ హోల్డర్లు Lava X3 (2022) పై 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI కొనుగోలు ఆప్షన్ కూడా ఉంది.
Lava X3 (2022)ని Amazon India వెబ్‌సైట్, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఈ డివైజ్ 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 6,999గా ఉంది.

Lava X3 (2022) స్పెసిఫికేషన్‌లు :
లావా X3 (2022) 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.
720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 3GB RAMతో వచ్చిన MediaTek Helio A22 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఈ డివైజ్ 32GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Lava X3 (2022) స్టోరేజీని 512GB వరకు విస్తరించడానికి మైక్రో SD కార్డ్‌తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌లో ఫోన్ రన్ అవుతుంది.
ఆప్టిక్స్ కోసం, Lava X3 (2022) వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి.
8MP ప్రైమరీ కెమెరాతో పాటు LED ఫ్లాష్‌తో కూడిన VGA సెన్సార్‌ను కలిగి ఉంది.
ఇక సెల్ఫీల కోసం డివైజ్ ముందు భాగంలో 5MP కెమెరాను కలిగి ఉంది.
హ్యాండ్‌సెట్‌కు 4,000mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. 10 వాట్ల ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తుంది.
సెక్యూరిటీ పరంగా ఫోన్‌లో వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news