తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు సోమవారం రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.

కరోనా బారిన పటడంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసి వారు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా స్వల్ఫ లక్షణాలు ఉన్నా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.