హెటిరో పరిశ్రమ దగ్గర చిరుత సంచారం..

-

Hetro పరిశ్రమలో చిరుత సంచారం చేసింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలో hetro పరిశ్రమలో చిరుత చొరబడి.. అందరికీ చుక్కలు చూపించింది. hetro పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో దాగి ఉన్న చిరుత.. ఒక్కసారిగా అందరికీ కనిపించి, భయాందోళనలకు గురి చేసింది.

ఈ నేపథ్యంలోనే, సిబ్బంది సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కంపెనీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
గత మూడు నెలల క్రితం కూడా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో భయభ్రాంతులకు గురైతున్నారు Hetro పరిశ్రమ కార్మికులు.

Read more RELATED
Recommended to you

Latest news