రష్యా పై ఆరవ దఫా ఆంక్షల ప్యాకేజీని బెల్జియం ప్రధాని స్వాగతించారు. అయితే ఇప్పటికే తీసుకున్న ఆంక్షల ప్రభావం ఎలా ఉందో తెలుసుకునే వరకూ కాస్త విరామం ప్రకటించాలని పిలుపునిచ్చారు. రష్యాపై ఆరవసారి ఆంక్షలను విధించేందుకు ఈయు సభ్య దేశాలన్నీ సూత్రప్రాయంగా అంగీకరించాయని మంగళవారం ఈయు కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ ధృవీకరించారు. రష్యన్ చమురు పై పాక్షికంగా ఆంక్షలు విధించడం కూడా ఈ అంశంలో భాగంగా ఉంది.
బుధవారం ఈ ఆంక్షలకు ఆమోద ముద్ర పడుతుందని భావిస్తున్నారు. రష్యా అతి పెద్ద బ్యాంకు సెబర్ ను స్విఫ్ట్ ఫైనాన్షియల్ వ్యవస్థ నుండి మినహాయించడం ఈ అంశంలో భాగంగా ఉంది. మరో మూడు రష్యాను బ్రాడ్కాస్టర్ లను ఈయూ నుండి నిషేధించారు. రష్యన్ పౌరులపై మరిన్ని వ్యక్తిగత ఆంక్షలను విధించారు.బ్రస్సేల్స్ లో ఈయు సదస్సుకు రెండు రోజులు ముందుగా బెల్జియం ప్రధాని జర్నలిస్టుల తో మాట్లాడుతూ, చమురు ఆంక్షల ప్రభావం అపారంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అందువల్ల తిరిగి ఆంక్షలు విధించడానికి కొంత విరామం అవసరమని అన్నారు.