ఇండియా- బంగ్లాదేశ్ మధ్య మరో రైలు ప్రారంభం

-

ఇండియా- బంగ్లాదేశ్ ల మధ్య మరో రైలును ప్రారంభించారు ఇరు దేశాల మంత్రులు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బంగ్లాదేశ్ రైల్వే మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ప్రారంభించిన ‘ మిటాలి’ ఎక్స్ ప్రెస్ ఇరు దేశాల మధ్య మూడో రైలు. పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్పాయ్ గురి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కంటోన్మోంట్  మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. భారత్ లోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ కు వారసత్వ, వాణిజ్య, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

కరోనా వల్ల గత రెండేళ్ల నుంచి భారత్ నుంచి బంగ్లాదేశ్ కు మధ్య రైళ్లను రద్దు చేశారు. అయితే ఇటీవల మళ్లీ రెండు రైళ్లను పునరుద్ధరించారు. బంధన్ ఎక్స్ ప్రెస్, మైత్రీ ఎక్స్ ప్రెస్ లను తిరిగి ప్రారంభించారు. బంధన్ ఎక్స్ ప్రెస్ కోల్ కత్తా , బంగ్లా దేశ్ కుల్నా మధ్య ప్రయాణిస్తుంది. మైత్రి ఎక్స్ ప్రెస్ కోల్ కతా, బంగ్లాదేశ్ ఢాకాల మధ్య ప్రయాణిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news