ప్రధాని మోడీకి విపక్షాలు లేఖ రాశాయి. ప్రధానికి నలుగురు ముఖ్యమంత్రుల సంతకాలతో లేఖ రాశారు. మోడీకి కేసీఆర్, మమతా, భగవంత్‌సింగ్ మాన్, కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ లేఖపై తేజస్వీయాదవ్, ఫరుక్, శరత్‌పవార్ కూడా సంతకాలు పెట్టారు. ప్రజా తీర్పును గౌరవించాలని మోడీకి హితువు పలికారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని… గవర్నర్ వ్యవస్థను రాజకీయలకోసం వాడుకుంటున్నారని విపక్షాలు మండిపడ్డాయి.
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని… 2014 నుంచి దర్యాప్తు సంస్థల వ్యవహారశైలి ఇమేజ్‌ని దెబ్బతీసిందని ఫైర్ అయ్యారు. ఆ సంస్థలకు ఉన్న స్వయంప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తాయి…. ఇండియా ఇంకా ప్రజాస్వామ్య దేశమని నమ్ముతున్నామని తెలిపాయి విపక్షాలు. విపక్ష సభ్యులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని…సిసోడియా అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందన్నాయి. సిసోడియాకు విద్యావస్థలో మంచి సంస్కరణలుతెచ్చారని దేశమంతా పేరుందని గుర్తు చేశాయి.