ఆంక్షలు ఎత్తేయండి.. రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌

-

దేశ వ్యాప్తంగా థ‌ర్డ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతుంది. ఇప్ప‌టికే కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ప్ర‌స్తుతం దేశంలో రోజుకు 25 వేల నుంచి 30 వేల చొప్పున కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర వైద్య‌ ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు లేఖ రాశారు. థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్న ఆంక్షల‌ను ఎత్తేయాల‌ని లేఖ‌లో సూచించారు.

రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆంక్షల‌ను ఎత్తివేయ‌డం గానీ.. స‌డ‌లించ‌డం వంటి నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు. కాగ దేశ వ్యాప్తంగా కరోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి .. జ‌న‌వ‌రి 21 నుంచే త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని అన్నారు. అలాగే రాష్ట్రాల్లో ఆంక్షలు ఎత్తివేసిని.. క‌రోనా నిబంధ‌న‌లు, టెస్ట్, ట్రాక్, ట్రీట్ తో పాటు వ్యాక్సినేషన్ ప్ర‌క్రియను కొన‌సాగించాల‌ని తెలిపారు. అలాగే దేశంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణీకుల‌పై కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఆంక్షల‌ను స‌డ‌లించింద‌ని లేఖ‌లో తెలిపారు. ఇక నుంచి వారికి 7 రోజుల క్వారంటైన్ ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news