ఈరోజుల్లో ఎక్కువమంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు గుండె సమస్యలు కారణంగా ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. గుండె సమస్యల్ని కనుగొనడం సులభమే. గుండె సమస్యలను మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. ఛాతి నొప్పి, భుజం నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్య, వెన్నునొప్పి, నడవడానికి ఇబ్బందిగా ఉండడం వంటి లక్షణాలు ద్వారా గుండె సమస్యలని కనుక్కోవచ్చు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి రెటీనా డిటాచ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
రెటీనా డిటాచ్మెంట్ అంటే ఏంటి దీని కారణాలు ఏంటి లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. కంటికి రక్తప్రసరణ, ఆక్సిజన్ లేకపోవడం తో ఓక్యులర్ స్ట్రోక్ అనేది వస్తుంది. ఈ టైం లో కణాలు చనిపోతాయి. దీన్నే రెటీనా ఇస్కీమిక్ పెరివాస్క్యులర్ అంటారు. ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ టెస్టుతో ఈ సమస్యని గుర్తించొచ్చు. రెటీనా OCT స్కాన్‌లను కంటికి మాత్రమే కాకుండా శరీరంలోని అన్ని ప్రాంతాలలో సమస్యలని నిర్ధారించడానికి అవుతుంది. ఈ కంటి స్కాన్ ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి ఇతర సమస్యలని కూడా తెలుపుతుంది.
హైబీపి, హై కొలెస్ట్రాల్, స్ట్రోక్ వంటి సమస్యలని ముందే కంటి డాక్టర్లు గుర్తించగలరు. రక్తనాళాలు, నరాల బంధన కణజాలం పని తీరు ని డాక్టర్స్ కళ్ళ తో పరిశీలిస్తారు. అయితే ప్రారంభం లోనే ఈ సమస్యని గుర్తిస్తే గుండె పోటు, స్ట్రోక్‌ని తప్పించుకో వచ్చు. గుండె జబ్బుల కారణంగా చాలా మంది ఈ లోకాన్నీ విడిచి వెళ్లి పోతున్నారు. కంటి పరీక్షను ఆరు నెలలు, సంవత్సరం సమయంలో చేయించాలి.
టెస్ట్ ని ఎప్పుడు చేయించుకోవాలి..?
చీకటిగా అనిపించడం
నీడలు
సరిగ్గా కనిపించకపోవడం
దృష్టిలో ఆకస్మిక మార్పులు
కంటిలోని రక్తనాళాల్లో
ఈ సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మెదడులో తీవ్రమైన స్ట్రోక్‌కి లక్షణం అవ్వచ్చు. కంటిలోని చిన్న రక్తనాళాలకు సూక్ష్మ, ముందుస్తు గుండె సమస్యల తో హార్ట్ హెల్త్ ని కనుక్కోవచ్చు.