అలర్ట్‌.. వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే

-

ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దాదాపు అందరూ డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. అయినా బ్యాంకు శాఖల్లో ఆర్థిక లావాదేవీలు, ఆర్థికేతర లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి రావచ్చు. కనుక బ్యాంకు శాఖలకు వెళ్లే వారు ఒకసారి బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో చెక్ చేసుకుంటే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మే నెల ముగింపునకు వస్తున్నది. మరో ఆరు రోజుల్లో మరో నెల చరిత్ర కాల గమనంలో కలిసిపోనున్నది.

Bank Holidays In June 2023: Banks Will Be Closed For 12 Days Across States  In June

జూన్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు చూద్దాం..

జూన్ 4వ తేదీ – ఆదివారం
జూన్ 10వ తేదీ – రెండో శనివారం
జూన్ 11వ తేదీ – ఆదివారం
జూన్ 18వ తేదీ – ఆదివారం
జూన్ 24వ తేదీ – నాలుగో శనివారం
జూన్ 25వ తేదీ – ఆదివారం

దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్కడి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆ రాష్ట్రాలు ఏంటో తెలుసుకుందాం.

జూన్ 15వ తేదీ – ఒరిస్సా, మిజోరంలో రాజ సంక్రాంతి సందర్భంగా బ్యాంక్ హాలిడే
జూన్ 20వ తేదీ – ఒరిస్సాలో బ్యాంక్ హాలిడే, రథయాత్ర సందర్భంగా
జూన్ 26వ తేదీ – త్రిపురలో బ్యాంకులకు సెలవు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news