ఈ ‘ ఓవర్ ‘ రియాక్షన్ లు తగ్గించుకుంటే మంచిదేమో .. !

-

మహమ్మారి కరోనా వైరస్ ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఒకపక్క ఆర్థికంగా నష్టపోతూ ఉండగానే మరోపక్క ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నాయి. మొదటి దశ మరియు రెండో దశలో కూడా కట్టడి కాకపోవడంతో మూడో దశ లాక్ డౌన్ నిర్ణయం కేంద్రం తీసుకొన్నా సంగతి అందరికీ తెలిసినదే. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ చాలా ఉధృతంగా విస్తరిస్తుంది.YSRCP MLA's Irresponsible Behaviour Spikes Corona Cases in ... లాక్ డౌన్ రాష్ట్రంలో చాలా కఠినంగా అమలు చేస్తున్నా కానీ వైరస్ విస్తరించడానికి కారణాలలో ఒక కారణం వైసీపీ నేతల అత్యుత్సాహం అనే వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ పర్యవేక్షణ పేరుతో, పేదలకు సహాయం పేరుతో వైసీపీ నాయకులు చేస్తున్న పనులు వల్ల జగన్ సర్కార్ వివాదాల్లో ఇరుక్కుంటుంది. సహాయం పేరుతో చేస్తున్న పర్యటనలో చాలాచోట్ల భౌతిక దూరం వంటివి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

 

ఈ విధంగా వ్యవహరిస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా ఎందుకు ఉంటుందని ఎప్పటినుండో అంటూనే ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు వైసిపి నాయకులు చేస్తున్నా  ‘ఓవర్ ‘ రియాక్షన్ లు ముందునుండి తగ్గించుకుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇక నుండైనా అత్యుత్సాహం పనులు తగ్గించాలని కోరుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news