ప్రపంచదేశాలను చుట్టుముట్టిన కరోనా మహమ్మారి భారత్‌ను సైతం వణికిస్తోంది. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అందరికీ ముచ్చెమటలు పట్టిస్తుంది కరోనా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి లక్షా 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు బాధితులు సైతం 18 లక్షలు దాటిపోయారు. ఇక దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన స్వైన్ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరమని తాజా లెక్కలు చూస్తుంటేనే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. భారత్‌లోనూ కరోనా రోజురోజుకు విస్తరిస్తుంది.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 10 వేలు దాటగా.. మరణాల సంఖ్య మూడు వందలు దాటింది. అయితే 979 మంది కరోనా నుంచి కోలుకుని.. డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనాకు ముందు లేకపోవడంతో.. ప్రపంచదేశాలు నివారణ చేపట్టారు. ఈ క్రమంలోనే భారత్‌లోనూ కేంద్రం లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ లాక్‌డౌన్ దెబ్బకు జనజీవితం స్తంభించిపోవడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇప్పటికే దేశంలో భారీ కంపెనీలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అన్నీ మూతపడ్డాయి.
ఇక కంపెనీలు మూతపడడంతో ఉద్యోగాలు కోల్పోతున్న ప్రజలను ఎందరో ఉన్నారు. మరోవైపు రైళ్లు, బస్సులు మరియు విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలా లాక్‌డౌన్ దెబ్బకు అన్ని వ్యవస్థలు అతలా కుతలం అయ్యాయి.. అవుతున్నాయి. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.7 నుంచి 8 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు వ్యాపార విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే రోజుకు భారత్ రూ.35 వేల కోట్ల నష్టపోతుందని ప్రపంచ బ్యాంక్ కూడా అంచనా వేసింది. దీంతో అభివృద్ధి దశలో ఉన్న భారత్‌కు ఈ కరోనా ఎఫెక్ట్‌తో మరింత వృద్ధి రేటు పడిపోయిందంటున్నారు.