వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా అసెంబ్లీ వద్ద చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. అసెంబ్లీ లోకి కొన్ని మీడియా సంస్థలను అనుమతించక పోవడం తో సంకెళ్లు, నల్ల కండువాలతో నిరసన చేపట్టు. చేతులకు సంకెళ్లు వేసుకుని లోకేష్ నిరసన తెలిపారు. ఇక అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాలి నడకన వెళ్లారు. ఫైర్ స్టేషన్ మీడియా పాయింట్ వద్ద అచ్చన్నాయుడు మాట్లాడుతూ జగన్ కు ఎవ్వరు ఓట్ వేసారో ఆ వర్గాలు పైనే దాడులు జరుగుతున్నాయని అన్నారు.
ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనారిటీ ల పై జరిగిన దాడులకు నిరసనగా నేడు వాయిదా తీర్మానం ఇచ్చామని ఆ వర్గాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే వాయిదా తీర్మానాన్ని అనుమతించి చర్చించాలని అన్నారు. బీసీలుగా పుట్టడం నేను , కొల్లు రవీంద్ర చేసిన తప్పా అందుకే మా మీద కేస్ లు పెట్టారా ? అని ఆయన ప్రస్నిన్చినారు. అసెంబ్లీ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని దాచిపెట్టడానికే మీరు కొన్ని మీడియాలనును బంద్ చేస్తారా ? ముఖ్యమంత్రి మటాడితేనే లైవ్ వస్తోంది ప్రతిపక్ష నేత, సభ్యులు మటాడినప్పుడు లైవ్ కనపడనివ్వడం లేదు. శాసన సభ లో ప్రజా సమస్యలపై జరిగే చర్చలు తెలియకుండా కొన్ని మీడియాలను నియంత్రిస్తున్నారని ఆయ అన్నారు.