
విద్యాసంస్థల సెలవులను 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు జనవరి 17 నుంచి 30 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ విసి టి.రమేష్ కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండేందుకు వారికి ఆన్లైన్ ద్వారా విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.