ఏపీ రోడ్ల పరిస్థితులపై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు నారా లోకేష్. పక్క రాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకి ఉదాహరణగా మన ఏపీని చూపిస్తున్నారని.. అయినా ప్రభుత్వ స్పందన శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలకు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి దగ్గర, హిందూ ధర్మ ప్రచారమే జీవిత లక్ష్యంగా సాగుతోన్న చిన జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారని వెల్లడించారు.
గతుకులు-గుంతలు, ఒడిదుడుకుల గురించి చిన జీయర్ తన ఆధ్యాత్మిక ప్రసంగంలో ప్రస్తావించారన్నారు. జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరం వరకూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందని రోడ్ల దుస్థితిని భక్తులకు చెబుతున్నట్టే ప్రవచనంలో భాగంగానే వ్యాఖ్యానించారని వెల్లడించారు. జగన్ పాలనలో రహదారులు ఎంత దారుణంగా వున్నాయో చినజీయర్ మాటలతో స్పష్టం అవుతోందని ఎద్దేవా చేశారు నారా లోకేష్.