టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు.. సర్కారు ఫెయిల్యూర్ అని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థుల్ని తగ్గించే కుట్ర అని.. టెన్త్ ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంటర్, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందని కుట్రతోనే ఎక్కువ మందని ఫెయిల్ చేశారని ఆరోపణలు చేశారు. తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షలు పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసులతో అభాసుపాలు… అయిందని.. టెన్త్ రిజల్ట్స్ వాయిదా..దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమే అని మండిపడ్డారు.
నాడు నేడు పేరుతో రూ. 3500 కోట్లు మింగేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు… టీచర్లకి తన వైన్‌షాపుల వద్ద డ్యూటీ వేసే శ్రద్ధ విద్యపై సీఎం ఎప్పుడూ దృష్టి పెట్టలేదని అగ్రహించారు. మీడియంల పేరుతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలు అని.. ఒక్క డీఎస్సీ తీయకపోవడంతో హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు.
71 స్కూళ్లలో జీరో పాస్.. 20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని.. టెన్త్‌లో దారుణ ఫలితాలు ప్రభుత్వం పాపమే అని విమర్శలు చేశారు. పదో తరగతి కష్టపడి చదివి పాసై ఉంటే వైఎస్ జగనుకు విద్యార్థుల కష్టాలు తెలిసేవి… పరీక్షలు నిర్వహించడం దగ్గరనుంచి ఫలితాలు ప్రకటించేవరకు అంతా అస్తవ్యస్తం, గందరగోళమేనని మండిపడ్డారు.