ఒంటరితనం ఒంటికే కాదు.. మెదడుకు నచ్చదట

-

మనకు ఉన్న అవయవాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది కళ్లు అని అందరూ అంటారు..అవును కళ్లు లేకపోతే..మనిషి జీవితం శూన్యం.. కళ్లు మనకు బయటకు కనిపించడం వల్ల కళ్ల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు..కానీ మనిషిని కంట్రోల్‌ చేసే అతిముఖ్యమైన అవయవం బ్రెయిన్.. ఇది లోపల ఉంటుంది కాబట్టి ఈ బ్రెయిన్‌ పని ఏంటో చాలా మందికి తెలియదు..బ్రెయిన్‌ ఒక వ్యక్తిని పది మంది ముందు తెలివైనవాడిగా చూపిస్తుంది.. అదే పదిమంది ముందు బ్రెయిన్‌ లెస్‌గా కూడా చూపిస్తుంది. మనం బ్రెయిన్‌ ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తినాలి, అసలు బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే.. ఎలాంటి విటమిన్స్‌ కావాలి, ఏ అలవాట్ల వల్ల బ్రెయిన్‌ ఆరోగ్యం దెబ్బతింటుంది ఇవి తెలుసుకుందాం..

 

మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తినాలి..?

మన ఇంట్లోనే నలుగురు ఉంటే..నలుగురికి నాలుగు రకాలు ఆహార అలవాట్లు ఉంటాయి..మరి మన ఒంట్లో ఉన్న అవయవాలకు కూడా అంతే.. ఒక్కో అవయవానికి ఒక్కో టైప్‌ ఫుడ్‌ అంటే ఇష్టం ఉంటుంది తెలుసా..? ఏంటి నమ్మడం లేదా..? కళ్లకు క్యారెట్‌ అంటే ఇష్టం, కిడ్నీలకు బీన్స్‌ అంటే ఇష్టం, హార్ట్‌కు గుడ్‌ కొలెస్ట్రాల్‌తో ఉన్నవి ఏం పెట్టినా సరే ఓకే అంటుంది, లివర్‌కు ఇక ఆ హెర్బల్‌ టీలు, వాలనట్స్‌ లాంటివి ఇస్తే పండగ చేసుకుంటుంది..అలాగే బ్రెయిన్‌కు కూడా కొన్ని ఆహారాలు అంటే ఇష్టమండోయ్‌.. అవి ఏంట్రా అంటే..బీన్స్‌, బ్లూబెర్రీస్‌, అవకాడోస్‌, టమోటాలు, రెడ్‌ మీట్‌, ఆకుకూరలు, సాల్మాన్‌ చేపలు, నట్స్‌, క్యాబేజ్‌, బ్రౌన్‌ రైస్‌, రెడ్‌ వైన్‌ ఇవి.. ఇలాంటి ఆహారాలు మీరు మీ బ్రెయిన్‌కు ఇచ్చారంటే.. అది హెల్తీగా ఉంటుంది.. బ్రెయిన్‌ హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం.. లేదంటే.. అది గతాన్ని గుర్తుచేసుకుంటూ.. భవిష్యత్తును భయంకరంగా ఆలోచిస్తూ..మిమ్మల్ని ఆగం చేస్తుంది.. మీరే గమనించండి..కొంతమంది పాపం లేని సమస్యకు కూడా వాళ్ల ఓవర్‌థింకింగ్‌ వల్ల ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు.. కారణం.. వారి బ్రెయిన్‌ హెల్త్‌ సరిగ్గా లేకపోవడమే..!

బ్రెయిన్‌కు కావాల్సిన విటమిన్స్‌ ఏంటి..?

ఆహారంలోనే పోషకాలు, విటమిన్స్‌ ఉంటాయి..! బ్రెయిన్‌ షార్ప్‌గా ఉండాలంటే.. కొన్ని విటమిన్లు మీరు మీ శరీరానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే తెలివితేటలు పెరుగుతాయి.. ఎదిగేపిల్లలకు హార్లిక్స్ ఇస్తే.. హైట్‌ పెరుగుతారో లేదో కానీ.. ఇలాంటి విటమిన్స్‌ ఉన్న ఫుడ్‌ ఇస్తే.. మాత్రం.. తెలివితేటలు కచ్చితంగా పెరుగుతాయి. విటమిన్‌ B1 చాలా అవసరం.. దీన్నే థయామిన్‌ అని కూడా అంటారు. ఇది మెటబాలిజంను సరిచేసి..నాడి సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది..

విటమిన్‌ D, B12 కూడా మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరంలో విటమిన్‌ డీ లేకపోతే.. ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అరికాలి నుంచి తల వరకూ ప్రతిపార్ట్‌కు విటమిన్‌ డీ అవసరం. మీ మానసిక, శారీరకం, శృంగార ఆరోగ్యం బాగుండాలంటే.. శరీరంలో తగినతం విటమిన్‌ డీ ఉండాలి అని వైద్య నిపుణులు అంటున్నారు. వీటితో పాటు.. B6, B9 కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.. బీ విటమిన్స్‌ అన్నీ బ్రెయిన్‌కు చాలా మంచివి.. ఇవి అన్నీ ఒక్కోటిగా ఒక్కో మాత్ర వేసుకోవాలా అని మీకు డౌట్‌ రావొచ్చు..అవసరం లేదండీ.. పైన చెప్పిన ఆహారాల్లో ఈ విటమిన్స్‌ ఎలాగూ ఉంటాయి..కాబట్టి మీ డైట్‌లో వాటిని చేర్చుకోండి చాలు.

ఒంటరితనం కూడా మెదడుకు ప్రమాదమే..

మన సుఖం కోసం ఇతరులను కష్టపెట్టడం అనేది ఎంత చెడ్డ అలవాటో.. మీ ఎంజాయ్‌మెంట్స్‌, మీ సరదాలకు మనకోసం నిరంతరం శరీరం లోపల కష్టపడే అవయవాలను నాశనం చేయడం కూడా అంతే తప్పు. రోడ్డు పక్కన పానీపూరీ టెమ్‌టింగ్‌గానే ఉంటుంది, ఫ్రైడ్‌రైస్‌ అయితే ఆ వాసనకే నన్ను తినూ అని మిమ్మల్ని పిలిచినట్లు ఉంటుంది.. కానీ ఇవి తినడం వల్ల మీ శరీరంలో అవయవాలు ఎంత బాధపడతాయో తెలుసా..? వీటిని అరిగించుకోలేక, ఆ మసాలలను ఫిల్టర్‌ చేయలేక.. చాలా కష్టపడతాయి.. ఇలా తీవ్రంగా శ్రమించే ఆఖరికి అవి పాడవుతాయి.. నిద్రలేమి, ఆందోళన, శీతలపానియాలు, స్మోకింగ్‌, హార్మోనల్‌ ఇంబాలెన్స్‌.. ఇవే కాదు.. ఒంటరితనం కూడా మెదడు ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఒకే చోట గంటల తరబడి కుర్చోవడం ఇలాంటివి మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. బ్రెయిన్‌కు ఉన్న అతి పెద్ద లక్షణం ఏంటో తెలుసా..? మిగతా అవయవాలు ఆహారం, చికిత్సతో కోలుకుంటాయి..కానీ బ్రెయిన్‌ మాత్రం మీ ఆలోచనా విధానంతోనే త్వరగా కోలుకుంటుంది..మీరు ఎంత సంతోషంగా ఉంటే బ్రెయిన్‌ అంత ఆరోగ్యంగా ఉంటుంది. డొపమైన్‌, సెరోటైన్‌ లాంటి హ్యాపీ హార్మోన్లను రిలీజ్‌ చేస్తూ.. మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే.. ఎలాంటి సమస్య అయినా దరిచేరదు.. ఆరోగ్యం లేనిదే మనిషి ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు అనేది అక్షరసత్యం..! మన దేశంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ అనేది నాల్గవ అతిపెద్ద ప్రమాదకరమైన జబ్బుగా మారిది. లక్షమందికి ఏటా 105- 152 మంది చనిపోతున్నారు. మీరు ఆరోగ్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఒకసారి మీరే గమనించుకోండి..!

Read more RELATED
Recommended to you

Latest news