లవర్ బాయ్ మళ్లీ యాక్టివ్ అయ్యాడా…?

-

చాన్నాళ్లుగా కనిపించకుండా పోయిన తరుణ్‌ సడన్‌గా సోషల్‌ మీడియాలో బిజీ అయిపోయాడు. ‘నువ్వే కావాలి’ కంప్లీటెడ్ 20 ఇయర్స్‌ అని కేక్ కటింగులు, ఇంటర్వ్యూలతో జనాల్లోకి వచ్చాడు. మరి ఇన్నాళ్లు సైలెంట్‌ అయిన తరుణ్‌ ఇప్పటికైనా సినిమాలు చేస్తాడా.. అసలు తరుణ్‌తో సినిమాలు చెయ్యడానికి మేకర్స్ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారా?

తరుణ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చి రెండేళ్లు దాటుతోంది. 20ఏళ్ల క్రితం లవర్‌బాయ్‌గా ఫుల్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్న తరుణ్‌, ఈ ఫాలోయింగ్‌ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయాడు. ఓ అయిదేళ్లు స్టార్‌ హీరోగా వెలిగిన తరుణ్, ఆ తర్వాత సినిమా సినిమాకి పడిపోయాడు. అయితే తర్వాత ఇండస్ట్రీ కూడా ఈ హీరోని లైట్‌ తీసుకోవడం మొదలైంది.

ఆడియన్స్‌ అంతా మరిచిపోతోన్న టైమ్‌లో ‘నువ్వే కావాలి’ సెలబ్రేషన్స్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు తరుణ్. అయితే లాంగ్‌ గ్యాప్‌ తర్వాత సెలబ్రేషన్‌ మోడ్‌లో కనిపించిన తరుణ్, మళ్లీ సినిమాలు చేస్తాడా.. మునుపటిలా బాక్సాఫీస్‌ని, ఆడియన్స్‌ని మెప్పిస్తాడా అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

తరుణ్‌ని జనాలు మరిచిపోయి చాలా కాలమైంది. ఈ జనరేషన్‌ ఆడియన్స్‌కి అయితే తరుణ్‌ అనే హీరో ఉన్నాడనే విషయం కూడా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇలాంటి సిట్యువేషన్‌లో మార్కెట్‌లేని తరుణ్‌తో సినిమాలు తియ్యడానికి దర్శకనిర్మాతలు కూడా వెనకాడే అవకాశముంది. సో ఈ లెక్కలో చూస్తే తరుణ్‌ కెరీర్‌ మళ్లీ ట్రాక్‌ ఎక్కాలంటే అద్భుతాలు జరగాలి అంటున్నారు సినీజనాలు.

Read more RELATED
Recommended to you

Latest news