కలర్..మనం వేసుకునే కలర్స్ మన మానసికి స్థితిపైన బాగా ప్రభావితం చేస్తాయ్..కేవలం మానసిక స్థితేకాదు..కొన్ని కలర్ దుస్తులు వేసుకుంటే మన అందం రెట్టింపు అవుతుంది..మరికొన్ని ఉన్న అందం కూడా చెడగొడతాయ్. ఇలా రంగులకు మన జీవితంలో ప్రత్యేకం స్థానం ఉంది. కానీ చాలామందికి తమకు ఏ రంగు సరిపోతుందో అనేది ఐడియా ఉండదు. అలాంటివి తెలుసుకోవడానికి బాగా ఇష్టపడుతుంటారు.
ప్రముఖ టారో మెంటార్, న్యూమరాలజిస్ట్, వాస్తు నిపుణురాలు, ఆధ్యాత్మిక మరియు మానసిక వైద్యురాలైన మధు కోటియా కొన్ని సంవత్సరాలుగా తన సేవలను ఈ సమాజానికి అందించింది. మానసిక సామర్థ్యం,డిప్రెషన్, వ్యసనాలు, భయాలు ,భావోద్వేగ బాధలు, ఏకాగ్రత సమస్యలు, రిలేషన్ షిప్ సమస్యలు వంటి అనేక రంగాలలో ఈమె నైపుణ్యం పొందింది. ఈమె మన పుట్టిన బేసి, సరి సంఖ్యల తేదీలను బట్టి ఏ కలర్స్ మనకు లక్కీ కలర్సో వేటికి దూరంగా ఉండాలో చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసకుందాం.
నెంబర్1: ఏ నెలలోనైనా 1, 10, 19 మరియు 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు బేస్ 1 కిందకు వస్తారు. ఆరెంజ్, పసుపు మరియు బంగారం రంగు ఈ వ్యక్తులకు అనువైనవి. బేస్ 1 సూర్యుడిచే పాలించబడుతుంది కాబట్టి, ఆరెంజ్,పసుపు రంగులు వీరికి అదృష్ట రంగులు. ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులకు ఈ రంగులు విజయం, శక్తిని అందిస్తాయి. అయితే, నంబర్ వన్ వ్యక్తులు నలుపు మరియు మెరూన్ వంటి రంగులకు దూరంగా ఉండాలి.
నెంబర్ 2: ఏ నెలలోనైనా 2, 11, 20 మరియు 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు బేస్ సంఖ్య 2గా పరిగణించాలి. ఈ వ్యక్తులు గ్రహం చంద్రుని క్రిందకు వస్తుంది. బేస్ 2 వ్యక్తులకు ఆకుపచ్చ రంగు ఉత్తమంగా సరిపోతుంది. ఆకుపచ్చ రంగు షేడ్స్‌ను కూడా ప్రయత్నించవచ్చు. ఆకుపచ్చతో పాటు, పసుపు మరియు వెండి కూడా నంబర్ టూ వ్యక్తులకు అనుకూలమైన రంగులు. ఎరుపు మరియు నలుపు బేస్ 2 కి దురదృష్టకరం కాబట్టి వారు ఈ రంగులను వేసుకోకపోవటం మంచిది.
నెంబర్ 3: ఏ నెలలోనైనా 3, 12, 21 మరియు 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు బేస్ నంబర్ 3గా పరిగణించాలి. ఈ వ్యక్తులు బృహస్పతి గ్రహం కిందకు వస్తారు. వీరికి పసుపు, నారింజ లేదా పింక్. రెడ్ షేడ్స్ కూడా బేస్ 3వ్యక్తులకు మంచిది. నంబర్ 3 వ్యక్తులు నలుపు, ముదురు నీలం లేదా ముదురు ఆకుపచ్చ వంటి రంగులకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అది వారిపై సానుకూల ప్రభావం చూపదు.
నెంబర్ 4: ఏ నెలలోనైనా 4, 13, 22 మరియు 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు రాహు గ్రహం కిందకు వస్తారు.వారికి అదృష్ట రంగు నీలం. నీలిరంగుతో పాటు, అన్ని ఇతర రంగులు వారికి తటస్థంగా ఉంటాయి.ఒక్క నలుపు రంగుకు మాత్రం వీరు దూరంగా ఉండాలి.
నెంబర్ 5: ఏ నెలలోనైనా 5, 14 మరియు 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు మెర్క్యురీ గ్రహం ద్వారా పాలించబడతారు. బూడిదరంగు రంగు వారికి అదృష్టం, అది అంతిమ విజయాన్ని అందిస్తుంది. దీనితోపాటు వారు లైట్ కలర్స్ కూడా ధరించవచ్చు. వీరు కూడా నలుపు,ముదురు ఆకుపచ్చ రంగుకు దూరంగా ఉండాలి.
సంఖ్య 6: ఏ నెలలోనైనా 6, 15 మరియు 24 తేదీలలో జన్మించినవారు శుక్ర గ్రహం కిందకు వస్తారు. వీరికి ముదురు ఆకుపచ్చ,ముదురు నీలం రంగులు అదృష్టరంగులుగా చెప్పవచ్చు.నీలం,ఎరుపు రంగుల వివిధ షేడ్స్ కూడా వారికి అదృష్టంగా ఉంటాయి. వీరు ఖచ్చితంగా తెలుపు, పసుపు మరియు గులాబీ రంగు నుండి దూరంగా ఉండాలి.
సంఖ్య 7: ఏ నెలలోనైనా 7, 16 మరియు 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు కేతు గ్రహం కిందకు వస్తారు. వారికి, లేత ఆకుపచ్చ లేత పసుపు మరియు లేత నీలం చాలా అదృష్టవంతమైన రంగులు. ఈ రంగులు వారికి విజయం,శ్రేయస్సును తెస్తాయి. వీరు ముదురు రంగులు ముఖ్యంగా నలుపు,ఎరుపు రంగులకు దూరంగా ఉండాలి.
సంఖ్య 8: ఏ నెలలోనైనా 8, 17 మరియు 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు శని గ్రహం ద్వారా పాలించబడతారు. ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం..పసుపు రంగు వీరికి లక్కీ కలర్. ఇది వారికి జీవితంలో అన్ని దశలలో విశ్వాసం,విజయాన్ని అందిస్తుంది. ముదురు ఆకుపచ్చ, ముదురు నీలం కూడా 8 సంఖ్య వారికి మంచి ఫలితాలను ఇస్తాయి, ఈ వ్యక్తులు నలుపు రంగు పట్ల ఆకర్షితులవుతారు కానీ వారు ఈ రంగును ఉపయోగించడం మంచిది కాదు. దాంతోపాటు ఎరుపు రంగుకు కూడా దూరంగా ఉండాలి. ఇది వారి జీవితంలో సమస్యలను తెస్తుందట.
సంఖ్య 9: ఏ నెలలోనైనా 9, 18 మరియు 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు ప్లానెట్ మార్స్ రూల్ నంబర్ 9 కిందకు వస్తారు. ఈ వ్యక్తులకు ఎరుపు రంగు అదృష్ట రంగు. 9 పుట్టిన తేదీ ఉన్న వ్యక్తులు సాధ్యమైనంత వరకూ ఎరుపు రంగును ఉపయోగించటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎరుపు వారికి అదృష్టం. ఈ వ్యక్తులు లైట్ కలర్స్,వైట్ కు దూరంగా ఉండటం మంచిది.
ఇదండి మ్యాటర్..మొత్తంగా కాకపోయినా కొంతైనా మీ పుట్టినతేదీని బట్టి వచ్చిన కలర్స్ కి మారటానికి ట్రై చేసి చూడండి.