నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడి విచారణకు హాజరయ్యారు. కాగా సోనియాగాంధీకి ఈడి అధికారులు మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. దీంతో ఆమె ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు. విచారణ కోసం మళ్లీ మధ్యాహ్నం మూడున్నరకు తిరిగి రావాలని అధికారులు ఆమెకు సూచించారు.. నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి వేర్వేరు కోణాల్లో ఈడి అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.
మరోవైపు సోనియా పై ఈడి విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేతపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు బిజెపి భయపడి ఈడిని పంపిస్తుందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.