అల్లు శిరీష్ కు టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. మెగా మేనల్లుడిగా అల్లు వారి అబ్బాయి గా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మెగా బ్యాక్ గ్రౌండ్… మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఉన్న అల్లు శిరీష్‌కు మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ లవ్ స్టోరీతో వచ్చేశారు. అల్లు శిరీష్. “ఊర్వశివో రాక్షసివో” అనే సినిమాతో ఇప్పుడు వచ్చేశారు అల్లు హీరో శిరీష్. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి విజయ్ – విరాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ” అనగా అనగనగా.. కనులే కలగనగా” అంటూ ఈ పాట సాగుతోంది. పూర్ణాచారి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూత్ కి నచ్చే బీట్ లోనే ఈ పాట సాగింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.