మీకు సలాం, ట్రెండింగ్‌లో థాంక్యూ మహి..!

-

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు గత రాత్రి ప్రకటించాడు. ఆ వెంటనే ఏ మాత్రం ఊహించని విధంగా ‘నీ దారిలోనే నడుస్తా’ అంటూ సురేశ్‌ రైనా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ దిగ్గజాల ఆకస్మిక నిర్ణయాలతో యావత్ క్రికెట్ ప్రపంచం కలవరపాటు గురి కాగా.. సహచర ఆటగాళ్లు సైతం షాక్‌కు గురయ్యారు.

సోషల్ మీడియా వేదికగా ఈ దిగ్గజాలకు ఘన వీడ్కోలు పలికారు. దీంతో #ThankYouMahi, #ThankYouDhoni హ్యాష్‌టాగ్‌లుట్రెండ్ అయ్యాయి. అయితే, ధోనితో పాటే సురేష్‌ రైనా కూడా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం బాధగా ఉందని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు.

 

దాదాపు 16 ఏళ్ళ పాటు భారత జట్టుకు ఎంఎస్ ధోనీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌ (2011)తో పాటు 2013లో చాంపియన్‌ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. ఆట నుంచి రిటైర్‌ అయినా మా గుండెల్లో చిరకాలం ఉంటామని ఇంకో అభిమాని ప్రేమని చాటుకున్నారు. 33 ఏళ్ల రైనా కూడా ఆటకు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కొందరు భావోగ్వేదం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news