ఎన్నికల బరిలో మంచు విష్ణు.. పోటీగా ఎవరంటే..!

హైదరాబాద్: త్వరలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంచు విష్ణు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే చిరంజీవితో చర్చించిన తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అటు నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారట. ప్రకాశ్ టీమ్‌లో శ్రీకాంత్, బెనర్జీ ఉండనున్నారని సమచారం.

ఇక సినీ ఇండస్రీలో మోహన్ బాబుకు మంచి గుర్తింపు ఉంది. ఆయన తనయుడు మంచు విష్ణు. ఆయన తక్కువ సినిమాలే చేసినా ఢీ సినిమాతో నటుడిగా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా మా అసోసియేషన్‌లో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం మూవీ ఆర్టిస్టు అధ్యక్షుడిగా నరేశ్ కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రాజీనామా చేశారు. స్వయంగా చిరంజీవి, మోహన్ బాబు ఉన్న వేదిక వద్దే రాజశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా కారణంగా షూటింగులు బంద్ అయ్యాయి. ఆ తర్వాత సినీమాలకు సంబంధించిన మీటింగులు కూడా జరగలేదు. మరికొన్ని రోజుల్లో మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు మరోసారి రసవత్తరంగా మారనున్నాయి.