ఇది మరీ దారుణం.. రేపు రిలీజ్ పెట్టుకుని ఈ రోజు ట్రైలర్ వదులుతారా..

ఓటీటీ వచ్చాక ప్రమోషన్లని పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుకే సినిమా రిలీజ్ డేట్లని కూడా పెద్దగా ప్రచారం చేయట్లేదు. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకి ప్రమోషన్ ఏ రేంజిలో ఉంటుందో తెలిసిందే. ఆ ప్రమోషన్లలో కొద్దిశాతం కూడా ఓటీటీ రిలీజ్ లపై పెట్టట్లేదని తెలుస్తుంది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మా వింత గాథా వినుమా అనే ట్రైలర్ రిలీజైంది. ఐతే ఈ సినిమా రేపే ఆహాలో అందుబాటులో ఉండనుంది.

సినిమా రిలీజే రేపు పెట్టుకుని ట్రైలర్ ఈ రోజు వదలడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది. గతంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన క్రిష్ణ అండ్ హిస్ లీల కూడా చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అప్పుడు ఆ సినిమాకి మంచి స్పందన వచ్చింది కాబట్టి, ఆ సెంటిమెంట్ ఇప్పుడు కుడా వర్కౌట్ అవుతుందనే ఇలా చేసారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అదంతా అటుంచితే, మా వింత గాథా వినుమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. గల్లీలో తిరిగే అల్లరిచిల్లర పోరగాడు సీరియస్ గా ప్రేమలో పడితే ఎలా ఉంటుందో కామెడీగా చూపిస్తున్నట్టు అర్థం అవుతుంది.