మాచర్ల ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాలే : వైసీపీ నేతల వార్నింగ్

-

నాలుగు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక రేపు 11 వ తేదీన… కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్… మంత్రివర్గ ఏర్పాటు పై చర్చోప చర్చలు చేస్తున్నారు. దాదాపు ఫైనల్ కు వచ్చింది మంత్రుల లిస్ట్. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈసారి మంత్రి పదవి ఇవ్వకపోతే తామంతా రాజీనామాకు సిద్ధం అని అక్కడి మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారు. మాచర్ల లోని మున్సిపల్ కార్యాలయంలో వారంతా తాజాగా సమావేశమై తీర్మానం కూడా చేశారు. అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఈ సారి కేబినెట్లో పిన్నెల్లి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేకపోతే రాజీనామాలు కూడా చేస్తామని హెచ్చరించారు. కాగా 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. వైసీపీ తరఫున మాచర్లలో 2014 అలాగే 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news