మాచెర్ల నియోజకవర్గం మొదటి వారం వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో కూడా బాగానే చేసింది

-

ఇటీవల కాలం లో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలలో ఒకటి యంగ్ హీరో నితిన్ నటించిన మాచెర్ల నియోజకవర్గం..విడుదలకి ముందే ‘రా రా రెడ్డి’ వంటి మాస్ బీట్ ఉన్న సాంగ్, దానికి తోడు అదిరిపొయ్యే టీజర్ మరియు ట్రైలర్ కట్స్ తో కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే అంచనాలను అభిమానుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో రేపిన ఈ చిత్రం ఇలా చతికిల పడుతుందని ఎవ్వరు ఊహించలేకపోయారు.

ప్రేక్షకులు కొత్త రకం సినిమాలకు అలవాటు పడ్డారు..అలాంటి సమయం లో పర్వాలేదు అనిపించే కమర్షియల్ సినిమాలకే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోతుంటే ఎప్పుడో 1990 నాటి కాలం స్టోరీ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది  సినిమా.. మాచెర్ల నియోజకవర్గం OTT కాలం లో అలాంటి చిత్రానికి డబ్బులు పెట్టి థియేటర్స్ కి వచ్చి చూడడానికి జనాలు వెర్రివాళ్ళు కాదు కదా..అందుకే ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..అయితే ఈ సినిమా విడుదలై నేటికీ వారం రోజులు కావొస్తుంది..ఈ వారం రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

నితిన్ మీడియం రేంజ్ హీరోలలో మినిమం గ్యారంటీ వసూళ్లు రప్పించే హీరో..అందుకే ఈ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా అదరగొట్టేశాయి..మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి నితిన్ కెరీర్ లోనే టాప్ 3 ఓపెనింగ్స్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది..ఇక ఆ తర్వాత రెండవ రోజు వసూళ్లు కూడా పర్వాలేదనే అనిపించుకుంది..అలా డీసెంట్ వీకెండ్ వసూళ్లను సాధించిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం చేతులేత్తిసింది..కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేక డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే దిశగా అడుగు వేస్తుంది..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 22 కోట్ల రూపాయలకు జరిగింది..కానీ మొదటి వారం లో ఈ సినిమా కేవలం 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది..అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని 50 శాతం రికవరీ చేసింది అన్నమాట.

ఫుల్ రన్ లో మరో రెండు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి బయ్యర్లకు 9 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించి డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవబోతుంది..అయితే ఇక్కడ నితిన్ కి ఉన్న బాక్స్ ఆఫీస్ పవర్ వల్ల ఈ సినిమా ఘోరమైన అవమానాలు నుండి మాత్రం తప్పించుకుంది..ఎందుకంటే ఇటీవలే విడుదలైన నాగ చైతన్య ‘థాంక్యూ’ మరియు మాస్ మహారాజ రవితేజ్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ ని క్లోసింగ్ లో కూడా వసూలు చేయలేకపోయాయి..కానీ మాచెర్ల నియోజక వర్గం అలా సింగల్ డిజిట్ క్లోసింగ్ తెచ్చుకొని అవమాన పాలవ్వకుండా డబులు డిజిట్ క్లోసింగ్ షేర్ ని రప్పించుకొని పర్వాలేదు అనిపించింది..ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చి ఉంటె కచ్చితంగా 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉండేదని ట్రేడ్ వర్గాల అంచనా..భీష్మ సినిమా తర్వాత పాపం నితిన్ కి సరైన హిట్ లేదు..ప్రస్తుతం ఆయన వక్కంతం వంశి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమాతో ఆయన మల్లి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news