ఓరి నాయనో.. ఇదేం పిచ్చి తల్లి.. పాముతో పరాచకాల..

-

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..అందులో ఓ గుడిలో హారతి ఇస్తున్న సమయంలో ఓ వృద్దురాలు నాగుపాముతో ఎంట్రీ ఇచ్చి తెగ ఊగిపోతూ డ్యాన్స్ చేసింది.. ఆ ఘటన హోళి రోజున జరిగింది.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.. చింద్వారా జిల్లాలో ఉన్న జామ్ సావాలి హనుమాన్ ఆలయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. గుడిలో మహా హారతి చేస్తున్న సమయంలో ఓ మహిళ అకస్మాత్తుగా తన చేతులకు పామును చుట్టుకుని ముందుకు వచ్చింది..


ఆ తర్వాత అక్కడే దేవుడ్ని స్మరిస్తూ నాట్యం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాము మహిళకు ఎలాంటి హాని కలిగించలేదు. కొంత సమయం తర్వాత ఆమె పామును వదిలివేసింది.ఈ సంఘటనను అక్కడున్నవారు కెమెరాలో బంధించారు. ఇక్కడ హనుమంతుని విగ్రహం పడుకునే స్థితిలో ఉంది. విగ్రహం నాభి నుండి నీరు నిరంతరం ప్రవహిస్తుంది. ఉదయం, సాయంత్రం హారతికి హాజరై హనుమంతుని నాభి నుండి వచ్చే నీటిని తీసుకుంటే మానసిక వ్యాధులు నయమవుతాయని, దుష్టశక్తులను దూరంగా పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అటువంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా జాతరను చేస్తారు..

మహా హారతి సందర్భంగా మహిళ చేతికి పాము చుట్టుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అటువంటి ఘటనలు దైవిక శక్తుల సమక్షంలో జరుగుతాయని పూజారులు చెబుతున్నారు..ఈ ఘటన మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది..  ఒకసారి ఆ వీడియోను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news