ఢిల్లీలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు..ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు బీఆర్‌ఎస్ నేతలు. కవితపై చేసిన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచితంగా మాట్లాడటంపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు. ఇక తెలంగాణలోనూ బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆద్వర్యం లో పంజాగుట్ట చౌరస్తా లో ధర్నా, దిష్టి బొమ్మ దగ్ధం చేసారు.