బలపరీక్షకు సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాలా సాహెబ్ ఆశయాలను నెరవేర్చామన్న ఉద్ధవ్ థాక్రే.. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని ఉద్ధవ్ థాక్రే మంత్రులతో అన్నారు. ‘మా ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉంది.
మా వాళ్లే.. పరాయి వాళ్లయ్యారు. మహావికాస్ అఘాడీకి ప్రత్యర్థుల దిష్టి తగిలింది. మా ప్రభుత్వానికి అదృష్టం కలిసి రాలేదు. శరద్ పవార్, సోనియాకు కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం.’ అని ఆయన అన్నారు. ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్‌గా, డీబీ పాటిల్ ఎయిర్‌పోర్ట్‌గా నవీముంబై ఎయిర్‌పోర్ట్‌ను మార్చుతూ చేసిన ప్రతిపాదనలకు ఉద్ధవ్ థాక్రే కేబినెట్ ఆమోదం తెలిపింది.