ఇంద్రకీలాద్రిపై రేపట్నుంచి ఆషాడమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. అయితే.. ఆషాడం సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారుల అంచనా వేస్తున్నారు. ఆషాడ మాసం నెలరోజుల పాటు సారెను సమర్పించే భక్తులు మూడు రోజులు ముందుగానే నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. జులై 28వ తేదీ వరకు ఆషాడమాసం సారె ఉంటుందని, ఎంత మంది భక్తులుతో వచ్చి అమ్మవారికి సారెను సమర్పిస్తారో ముందుగానే తెలియజేయాలని ఆలయ అధికారులు సూచించారు. విజయవాడలో బోనాల జాతర జూలై 3వ తేదీన ఆదివారం ఉదయం 11.30 గంటలకు జరుగుతుందని, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
బ్రాహ్మణ వీధి లోని జమ్మి దొడ్డి వద్దగల ఈ ఓ కార్యాలయం వద్ద నుండి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా నదిలో గంగ తెప్పల పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు ,ఒడిబియ్యాన్ని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాలు ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సమర్పించనుంది.