80 ఏళ్ళ వయసులో బిజెపికి చుక్కలు చూపిస్తున్న పవార్… 162 మంది ఎమ్మెల్యేలను హోటల్ కు…!

-

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరిగుతూ ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్న కూటమి నేతలు కీలక అడుగు వేసారు. తమ వెంట ఉన్న 162 మంది ఎమ్మెల్యేలను గ్రాండ్ హయత్ హోటల్ కు శరద్ పవార్ తీసుకు వెళ్ళారు. దీనితో ఒక్కసారిగా రాజకీయం కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు తమకు అంత బలం ఉంది ఇంత బలం ఉందని… చెప్పుకోవడమే గాని… ఇప్పటి వరకు బలప్రదర్శన అనేది జరగలేదు.

ఇక తాజాగా ఎమ్మెల్యేలను తీసుకుని, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు హోటల్ కి వెళ్ళడం  సంచలనంగా మారింది. వెళ్తూ వెళ్తూ జాతీయ మీడియాను కూడా తీసుకు వెళ్ళారు కూటమి నేతలు వీళ్ళ అందరికి కూడా ఇప్పుడు శరద్ పవార్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పటికైనా గవర్నర్ ఆహ్వానించాలని బిజెపి ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేసారు. అటు మాజీ సిఎం అశోక్ చావాన్ కూడా తమకు బలం ఉందని గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఇక ఎమ్మెల్యేల వెంట జాతీయ నేతలు కూడా ఉన్నారు.

తాము అధికారం కోసం తాపత్రయ పడటం లేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అజిత్ పవార్ పై ఉన్న కేసుని మహారాష్ట్ర ఏసీబీ కొట్టేసింది. జలవనరుల శాఖలో జరిగిన 70 వేల కోట్ల అవినీతిలో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అటు ఎమ్మెల్యేలను కూటమి నేతలు హోటల్ కి తీసుకువెళ్ళడం, అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా ముందుకి వచ్చారు. కూటమికి అనుకూలంగా తాము అంతా ఓటు వేస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ చేసారు. గవర్నర్ ని కలిసేందుకే ఎమ్మెల్యేలను తీసుకొచ్చామని కూటమి నేతలు అంటున్నారు.

ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడిన శరద్ పవార్… ప్రజల కోసమే ఇక్కడికి చేరుకున్నామని… బల పరీక్ష సమయానికి 162 మంది ఎమ్మెల్యేలను నేనే తీసుకువస్తాను. కుఠిల రాజకీయాలు చేయడానికి ఇది గోవా కాదు మహారాష్ట్ర. బీజేపీ ఎత్తులు ఇక్కడ పని చేయవని స్పష్టం చేసారు. మెజారిటి రుజువు చేయడంలో ఎలాంటి సమస్యా లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news