మహారాష్ట్రలోని చేకోడి గ్రామంలో శ్రీనివాస్, చంద్రకళ అనే దంపతులు ఉన్నారు. వీరికి 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీనివాస్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. చంద్రకళ కూడా ఉద్యోగం చేస్తూ ఉండేది. తను ఉద్యోగం చేసే కంపెనీలోనే రాజీవ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుతుంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
శ్రీనివాస్ ఇంట్లో లేని సమయంలో రాజీవ్ తో శారీరకంగా కలుస్తూ ఉండేది. శ్రీనివాస్ కి తన చుట్టుపక్కల ఉన్నవారు ఎంత చెప్పినా కూడా అతను నమ్మలేదు. శ్రీనివాస్ కంపెనీ పనిమీద వెళ్తున్నానంటూ అని చెప్పి వెళ్ళాడు. ఇక చంద్రకళ శ్రీనివాస్ ఇంట్లో లేడని రాజీవ్ తో ఎంజాయ్ చేయొచ్చు అని తనని ఇంటికి పిలిపించుకుంది.
ఈ క్రమంలో రాజీవ్ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో శ్రీనివాస్ ఇంటికి వచ్చి వారిద్దరిని పట్టుకున్నాడు. వీరిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కానీ చంద్రకళ రాజీవ్ తోనే ఉంటాను అని తెగేసుకుని చెప్పింది. దానికి నిరాకరించడంతో శ్రీనివాస్ పై ఇద్దరూ దాడి చేశారు. అనంతరం పిల్లల్ని వదిలేసి చంద్రకళ, రాజీవ్ తో వెళ్ళిపోయింది.