మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరిగింది. లోక్ మాన్య తిలక్ టెర్మినల్ (ఎల్టీటీ)-జయ్ నగర్ పవన్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు పట్టాలు తప్పింది. కనీసం 11 బోగీలు పట్టాలు తప్పాయి. లోకో పైలెట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్ రిలీఫ్ వ్యాన్ ప్రమాద స్థలానికి చేరుకుంది. నాసిక్ కు సమీపంలోని భూసావల్ డివిజన్ లో లహవిత్, దేవ్‌లాలిల మధ్య ప్రమాదం చోటు చేసుకుంది.
రైలు ప్రమాదంలో ఇద్దరికి మాత్రమే స్పల్పంగా గాయాలయ్యాయని… ఎవరూ చనిపోలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే పట్టాల పక్కన ఓ దొరికిన ఒక మృతదేహం రైలు పట్టాలు తప్పకముందు నుంచే అక్కడ ఉందని… అది ప్రయాణికుడిది కాదని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదం కారణంగా 7 రైళ్లను రద్దు చేసింది. మరో మూడు రైళ్లను దారి మళ్లించారు.
#UPDATE | Following 3 derailment of 11061 Express listed trains stand cancelled, diverted or terminated for a short duration: Central Railways pic.twitter.com/L0Iv555XNx
— ANI (@ANI) April 3, 2022