తెలియక చేసే ఈ తప్పుల వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పడిపోతుంది

-

శరీరానికి మెటబాలిజం చాలా అవసరం. కొన్ని రకాల అలవాట్ల అది పూర్తిగా తగ్గిపోతుంది. ఆ పొరపాట్లు ఏంటో ఈరోజు చూద్దాం.

కేలరీలు తగ్గటం

వెయిట్‌ లాస్‌కు ముఖ్యంగా అందరూ చేసే పని కేలరీలు తగ్గించుకోవడం. కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడం మంచిదే. కానీ, మరీ తక్కువ మోతాదులో ఉండటం వల్ల బాడీ మెటబాలిజం రేటు పడిపోతుంది.

వర్క్‌ ఫ్రం హోం కారణంగా..ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని కదలకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఇది జీవక్రియ రేటుతోపాటు పూర్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వ్యాయామం చేయడం, ఆటల వల్ల కేలరీలు తగ్గించుకోవచ్చు. నిలబడటం, క్లీనింగ్, మెట్లు వాడటం, శారీరక శ్రమ పెరగడం వల్ల కేలరీలు కరుగుతాయి.

చక్కెర ఉన్న పదార్తాలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఇన్సూలిన్‌ స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల ఒబేసిటీ, డయాబెటీస్‌ వస్తుంది. ఒక స్పూన్‌ షుగర్‌లో 55 శాతం ఫ్రక్టోజ్‌ ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం తగ్గిపోతుంది.

సరైన నిద్ర..

నిద్ర శరీరంపై ఎంతో ప్రభావం చూపుతుంది. తక్కువ నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. డిప్రెషన్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. దీంతో మెటబాలిక్‌ రేటు కూడా పడిపోతుంది. రోజంతా చిరాకు, బరువు పెరగడం వంటివి జరుగుతాయి.

బ్రేక్‌ఫాస్ట్..

చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్‌ చేస్తారు. దీనివల్ల కూడా మెటబాలిజం తగ్గుతుంది. పడుకున్న సమయంలో దీని రేటు తగ్గుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల తిరిగి ఫాస్ట్‌ అవుతుంది.

మద్యం..

ప్రతిరోజూ ఒక పెగ్ మందు తాగితే ఏమవుతుంది అనుకుంటారు. కానీ, వారం మొత్తం తాగితే మెటబాలిజం రేటుపై ప్రభావం చూపుతుంది.

రీఫైన్డ్‌ కార్బొహైడ్రేట్స్‌

ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌లో కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి. తెల్లగా ఉండే చక్కెర వంటివి రీఫైన్డ్‌ చేసినవి. అధిక ఫైబర్‌ తృణధాన్యాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. పోషకాలను విచ్చిన్నం చేయడానికి శరీరానికి ఇది కష్టతరమవుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు తగ్గుతుంది.

స్ట్రెస్‌..

బాగా స్ట్రెస్‌లో ఉన్నపుడు శరీరం కార్టిసల్‌ అనే హార్మొన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే మీ శరీరానికి శక్తినిచ్చే ఫుడ్‌ అవసరమని అర్థం. ఇది ఎక్కువవుతే కష్టం.

తగినంత నీరు తీసుకోవడం
శరీరానికి సరిపోయే నీటిని తీసుకోకపోతే మెటబాలిజం రేటు పడిపోతుంది. నీరు ఎక్కువ శాతం ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.

స్ట్రిట్ డైట్ ఫాలో అవటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు..కాబట్టి ఇలాంటి పొరపాట్లు మీరు చేస్తున్నట్లైతే.. మెటబాలిజం రేటు పెంచుకోవడానికి సరైన ప్రత్యామ్యాలు ఎంచుకుంటే సరి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news