పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారు – సినిమా టికెట్లపై మహేష్‌ కామెంట్‌

-

సీఎం జగన్‌ తో సమావేశం అనంతరం.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు మీడియాతో మాట్లాడారు. మరో 10 రోజుల్లోనే టాలీవుడ్‌ కు శుభవార్త అందనుందని చెప్పారు. మా అందరి తరపున చొరవ తీసుకున్నందుకు ముందుగా చిరంజీవికి ధన్యవాదాలు అని మహేష్‌ బాబు తెలిపారు.

గత 6 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్ఫ్యూజన్ లో ఉంది… నిజానికి ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి… స్పెషల్ గా పేర్ని నాని గారికి, సిన్సియర్ థ్యాంక్స్ టు సీఎం జగన్ గారికి… మీరందరూ ఒక వారం పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారని మహేష్ బాబు చెప్పారు.

ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్ పండిందని చెప్పడానికి సంతోషిస్తున్నాని అటు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సినిమా ప్రముఖులు సమావేశం అనంతరం మీడియాలో చిరంజీవి మాట్లాడారు. ఈ చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. టికెట్ ధరలపై కొన్ని నెలులగా ఏర్పడిన అనిశ్చితికి తెర పడిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news