Mahesh Babu : బిల్‌ గేట్స్‌ ను కలిసిన మహేష్‌ బాబు, నమ్రత

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట మహేష్‌ బాబు – నమ్రతదే. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. టక్కరి దొంగ సినిమాలో నమ్రత – మహేష్‌ బాబు ఇద్దరూ నటించారు. ఆ సినిమా సమయంలోనే… మహేష్‌ బాబు – నమ్రత ఇద్దరూ లవ్‌ లో పడ్డారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకుని.. ఇద్దరికి జన్మనించారు కూడా.

ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేకుండా.. వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా మహేష్‌ బాబు, నమ్రత… జంట మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ను కలిసింది. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు మహేష్‌ బాబు. ప్రపంచంలో చాలా ముఖ్య మైన వ్యక్తి మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌. ఆయనను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం వీరి ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news