జిమ్ లో మహేష్ బాబు వర్కౌట్స్..వీడియో వైరల్

-

మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక అతి త్వరలో జరగనున్న ఈ మూవీ కోసం ఇటీవల తన మేకోవర్ ని చాలా వరకు చేంజ్ చేసిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు జిమ్ లో ఎంతో కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తున్న పిక్ ని ఆయన భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే రోజు రోజుకి ఎంతో యంగ్ గా మారిపోతున్న సూపర్ స్టార్ మహేష్ తరచూ క్రమం తప్పకుండా చక్కని డైట్, అలానే పక్కాగా వ్యాయామం చేస్తుంటారు అనేది తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news