మహేశ్ – రాజమౌళి చేసేది ఒక సూపర్ హీరో కథ..!!

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో  తనదైన ముద్ర వేశారు. మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. నేషనల్ మీడియాలో ప్రతి రోజూ రాజమౌళి వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే రాజమౌళి తన తర్వాత సినిమాను మహేశ్ బాబుతో స్టార్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు కూడా  మొదటి సారి రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడు. దేశంలో రాజమౌళికి క్రేజ్ ఎలా వుందో మహేశ్ కు తెలుగు రాష్ట్ర లలో అలాంటి క్రేజ్ వుంది. ఈ సినిమా తో మహేశ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయే అవకాశం ఉంది.ఇప్పుడు వీరు ఇద్దరూ చేయబోతున్న కథ గురించి  తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కథ విషయంలో అనేక ప్రచారాలు వున్నాయి.

రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి చెబుతూ మహేష్ తో రాజమౌళి తెరకెక్కించే సినిమా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వుంటుందని అన్నారు.అలాగే రాజమౌళి కూడా ఇటీవలే మహేశ్ తో సినిమా జేమ్స్ బాండ్ ఇండియానా జోన్స్ లాగా వుంటుందని అన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఒక యాక్షన్, అడ్వెంచర్ సినిమా లాగా వుంటుందని, పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో , మహేశ్ బాబు ను సూపర్ హీరో లా చూపించ బోతున్నారని లీకులు అందుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news