మహేష్ ధైర్యం చేసాడు. ఇక మిగిలిన వాళ్ళే..

-

థియేటర్లో బొమ్మ పడక ఎనిమిదిన్నర నెలలు దాటిపోయింది. మహమ్మారి వచ్చి సినిమా థియేటర్లన్నింటినీ మూసివేసింది. ఒక్కసారిగా థియేటర్లు మూతపడేసరికి చాలామంది జీవితాలు ఆగిపోయాయి. ఐతే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గింది. అదీ కాకుండా దాని పట్ల జనాల్లో భయాందోళనలు తగ్గాయి. కానీ థియేటర్లు మాత్రం ఓపెన్ కాలేదు. దానికి ఒకే ఒక్క కారణం 50శాతం సీటింగ్ సామర్థ్యం అనే షరతు పెట్టడమే.

ఐతే రోజులు పెరుగుతున్న కొద్దీ జనాలు థియేటర్లని పూర్తిగా మర్చిపోయేలా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో శాంతి థియేటర్ లాంటి పేరొందిన సినిమా హాళ్ళు మూతబడ్డాయి. అందుకే ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 4వ తేదీ నుండి సినిమా హాళ్ళు తెరుచుకోనున్నాయి. మహేష్ బాబు మల్టీప్లెక్స్ అయిన ఏ ఎమ్ బీ సినిమాస్ డిసెంబరు 4వ తేదీ నుండి ఓపెన్ అవుతుంది. 50శాతం సీటింగ్ కెపాసిటీతోనే నడిపించనున్నారు. మరి మహేష్ లానే మిగతా వాళ్ళు ధైర్యం చేయగలిగితే ఫుల్ సీటింగ్ కెపాసిటీకి అనుమతులు వచ్చే అవకాశం ఉందేమో..!

Read more RELATED
Recommended to you

Latest news