నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుండి ఒక్కొక్కరుగా అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో పవన్ పై పంచ్ లు విసిరారు. ఈయన మాట్లాడుతూ జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ పార్టీని పవన్ పెట్టాడన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఓట్ల కోసం రాజకీయం చేయడం బాగా నేర్చుకున్నాడని సెటైర్ వేశారు. పవన్ ఎన్ని కామెంట్స్ చేసినా… పూజకు పనికిరాని పువ్వు అని కామెంట్ చేశాడు.
ఇంతకు ముందు చాలా సార్లు పొత్తుల గురించి వివిధ రకాలుగా టర్న్ లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయానికి అయినా ఒంటరిగానే పోటీ చేస్తాడని జనసైనికులు అనుకున్నారు. కానీ ఈ రోజు వారి నమ్మకం మీదనే దెబ్బకొట్టి చంద్రబాబు చెంతకు వెళ్లడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు.