ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వాళ్లకి ఉండటంతో వాళ్ల ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతో వాళ్లను గుర్తించడంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముందు ఉంది. గ్రామ వాలంటీర్ల ద్వారా విదేశాల నుండి వచ్చిన వివరాలను చాకచక్యంగా పసిగట్టి వాళ్లను 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో అబ్జర్వేషన్ లో ఉంచటంలో సక్సెస్ అయ్యారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగారు. అయితే ఈ విషయంలో మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా టెస్టులు జరగటంతో వాస్తవ నెంబర్ అక్కడ బయటపడిందని…కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఎక్కువ టెస్టులు జరగకపోవడంతో సరైన నెంబర్ బయట పడటం లేదని విపక్ష పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాలలో వైరస్ ని అరికట్టడానికి విదేశాలనుండి వైద్య బృందాలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా రెండు రాష్ట్రాలలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది నేపథ్యంలో పాటుగా విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వైద్యుల చేత మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాలలో చికిత్స చేయించాలి అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలలో కేసులు ఎక్కువగా నమోదు అవటానికి కారణం ఆ రెండు రాష్ట్రాలలో వైరస్ టెస్టులు బాగా ఫాస్ట్ గా జరగటమే అని అంటున్నారు.