ప్రపంచం మొత్తం కరువు వచ్చినా తెలంగాణాలో రాదు; కేసీఆర్

-

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్… ప్రగతి భవన్ లో రైస్ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం’ రూపొందించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని చెప్పిన ఆయన… అసెంబ్లీలో కూడా చర్చించి, విధానాన్ని ఆమోదిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వరిసాగు పెరుగుతు౦దన్న ఆయన… ఈ వేసవిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని… కోటి లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వర్షా కాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగే అవకాశం ఉందన్నారు. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉందని చెప్పిన కెసిఆర్… ప్రపంచ మంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదని ధీమా వ్యక్తం చేసారు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని ఆశా భావం వ్యక్తం చేసారు.

తెలంగాణ ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతుందని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని అన్న ఆయన… దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదని అన్నారు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news