టైటిల్: మేజర్
నటీనటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ
ఎడిటర్: వినయ్ కుమార్ సిరిగినీడి & కోదాటి పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంగీత దర్శకుడు: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, AMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A ప్లస్ S సినిమాలు
దర్శకత్వం : శశి కిరణ్ టిక్కా
రిలీజ్ డేట్ : 03 జూన్, 2022
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మేజర్’. జూన్ 3న(శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమా చూసి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు, హిందీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ‘రివ్యూ’లో తెలుసుకుందాం.
26/11 ముంబై దాడులు భారతదేవాన్ని ఎంతలా కుదిపేశాయో అందరికీ తెలుసు. భారతీయ టెర్రరిస్ట్ అటాక్ లోనే అత్యంత భారీ దాడుల్లో 175 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. లష్కర్ తోయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టులు ముంబై తాజ్ హోటల్ తో పాటు పరిసర ప్రాంతాల్లో దాడి చఏశారు. ఈ దాడులను ఎన్ ఎస్ జీ కమాండోలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ వీరమరణం పొందారు. ఈ ఘటన ఆధారంగా ‘మేజర్’ సినిమా తెరకెక్కింది. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరన్ తిక్క దర్శకత్వం వహించగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, ఏ ప్లస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి.
మేజర్ ఫిల్మ్..స్టోరి విషయానికొస్తే..మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ చిన్న తనం నుంచి సినిమాను స్టార్ట్ చేశారు. ఆయన పెరిగిన తీరును, ప్రేమను, సైనికుడిగా మారిన విధానం అద్భుతంగా చూపించారు. చిన్నప్పుతు తన తండ్రితో కలిసి ఏవియేషన్, నేవి ఎగ్జిబిషన్ కు వెళ్లిన క్రమంలో అక్కడ నేవీ అధికారులను చూసి వారికి దక్కిన గౌరవం చూసి ఉన్నికృష్ణన్ ఆనందపడుతాడు. వాళ్లలాగా కావాలనుకుంటారు. కానీ, తండ్రి తన తనయుడు డాక్టర్ కావాలని అనుకుంటాడు.
నేవీకి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరిస్తారు. దాంతో ఆర్మీలో జాయిన్ అవుతారు. అలా ఆర్మీ ట్రైనింగ్ లో సత్తా చాటి ..ఎన్ఎస్ జీ కమాండో ట్రైనర్ గా సందీప్ ఎదుగుతాడు. ఎన్ ఎస్ జీ ట్రైనర్ గా ఉన్న సందీప్ ముంబై దాడుల ఆపరేషన్ లో పాల్గొనేందుకు గల కారణాలేంటి? ఆయన లైఫ్ లో లవ్ కు ఉన్న స్థానం ఏంటి? తాజ్ హోటల్ లో దేశం కోసం సందీప్ ఏ విధంగా పోరాడాడనేది మిగతా సినిమా.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ అడివి శేష్ కనబర్చిన నటన అత్యద్భుతమని చెప్పొచ్చు. దర్శకుడు ప్రతీ ఒక్క పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. సినిమా చూసి బయటకు వస్తున్న క్రమంలో ప్రతీ ఒక్క ప్రేక్షకుడు భావోద్వేగానికి గురయ్యేలా చేశాడు. దేశం కోసం ప్రాణం ఆర్పించిన వీరుడి కథను వెండితెరపై ఆవిష్కరించిన తీరు పట్ల ప్రశంసలు వస్తున్నాయి. ఎమోషనల్ జర్నీగా సినిమా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు. శశికిరణ్ తిక్కా..దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్, సాము మంజ్రేకర్ ఇతర నటీ నటులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు.