Breaking : కాంట్రాక్టర్‌ లెక్చరర్ల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం..

-

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఏపీఆర్‌ఈఐ) సొసైటీ రెసిడెన్షియల్‌ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచింది ఏపీ ప్రభుత్వం. వీరికి రివైజ్డ్‌ పేస్కేల్‌ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్ల కాంట్రాక్టు సిబ్బందికి మినిమం టైమ్‌స్కేల్‌ను మంజూరు చేస్తూ గతంలో ఆర్థికశాఖ 40వ నంబరు జీవోను ఇప్పటికే జారీ చేసింది.

CM YS Jagan Mohan Reddy directs completion of 15.6L houses

దీన్ని ఏపీఆర్‌ఈఐ సొసైటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్‌.నరసింహరావు మెమో ఇచ్చారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్ట్‌ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news